Jagan Chandrababu Naiduప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించే ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. కొత్త విధానం ప్రకారం పార్టీ బలోపేతంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియ‌స్‌గా దృష్టి సారించారు. పార్టీకి సంబంధించి వివిధ స్థాయిల్లో క‌మిటీల‌ను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించేందుకు సిద్ద‌మ‌య్యారు.

ఇప్పటివరకు ఉన్న జిల్లా ఇంఛార్జ్లను తొలగించి వారి స్థానంలో పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జ్ లను నియమించారు. ఈ మేర‌కు పాత వారిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల‌కు కొత్త‌ ఇన్‌ఛార్జ్‌ల‌తో పాటు ప్రతి రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక్కో కో-ఆర్డినేట‌ర్‌ను కూడా నియమించారు.

పార్టీ నుండి బయటకు వెళ్లిన వారిని, పార్టీ కార్యకలాపాలలో స్తబ్దుగా ఉన్న వారినీ తప్పించి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఈ నియామకాలలో బీసీలకు, కాపులకు పెద్దపీట వేశారు. అలాగే… త్వరలోనే పార్టీ నుండి వెళ్లిన ఎమ్మెల్యేలు… అసెంబ్లీ ఇంఛార్జిల స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసే పనిలో ఉన్నారట.

ఇది ఇలా ఉండగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన అనేది అశాస్త్రీయమైనదని… దీని వల్ల ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంటుందని చాలా మంది మేధావులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ వివాదంలోకి వెళ్లకుండా ప్రభుత్వం తలపెట్టిన ప్రక్రియ ఆధారంగానే తమ పార్టీ నిర్ణమనాన్ని మార్చుకున్నారు చంద్రబాబు.