టిడిపి యువనాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తూ వైసీపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతుండగా, మరోపక్క టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తూ “ఇదేం ఖర్మ రాష్ట్రానికి?” కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తీరుని ఎండగడుతున్నారు.
బుదవారం జగ్గయ్యపేటలో ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా… ఈ నాలుగేళ్ళలో ఒక్క పనైనా చేశావా అని. ఏదైనా ఒకే ఒక్క పని చెప్పగలవా? కడపలో ఒకే ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించలేకపోయిన జగన్, నిన్న మళ్ళీ మరోసారి స్టీల్ ప్లాంట్‌కి భూమిపూజ చేశాడు. అది కూడా ఏదో ఘనకార్యం చేసిన్నట్లు నవుతూ! ఈసారి కూడా మీరు ఫ్యాన్ గుర్తుకి ఓట్లేస్తే ఆ తర్వాత అదే ఫ్యానుకి ఉరేసుకోవలసి వస్తుంది. కనుక రేపు మీ ఇంటికి గృహసారధులు వచ్చి వచ్చే ఎన్నికలలో వైసీపీకే ఓట్లు వేయాలని ప్రమాణం చేయమని అడిగితే ఫ్యానుకి ఉరేసుకోలేమని ధైర్యంగా చెప్పండి. ఈసారి తాడోపేడో తేల్చుకొంటామని స్పష్టంగా చెప్పండి.
జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకి వెళ్ళే ఆలోచనలు చేస్తున్నాడు. హటాత్తుగా ముందస్తుకి వెళితే మేము (టిడిపి) సిద్దంగా ఉండమని కనుక గెలిచిపోతామని కలలు కంటున్నాడు. కానీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేము రెడీగా ఉన్నాము. ఈ 5 కోట్ల మంది ప్రజలు కూడా జగన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు సిద్దంగా ఉన్నారు,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.