Chandrababu Naidu fires on ys jaganఆంధ్రప్రదేశ్ లో కాకుండా హైదరాబాద్ లో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తరచు విమర్శలు చేస్తారు. తీరా ఇక్కడకు వచ్చాకా కృష్ణా నది కరకట్ట మీద ఉన్న ఆయన ఇంటికి ఖాళీ చెయ్యమని నోటీసులు ఇస్తుంటారు. తాజాగా చంద్రబాబు ఏపీలో ఉన్న నేపథ్యంలో మరోసారి నోటీసు ఇచ్చింది ప్రభుత్వం.

ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంఉండగా.. అది 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందంటూ… ఖాళీ చేసి.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కృష్ణా నది కరకట్ట లోపలవైపు ఉన్న 36 అక్రమ కట్టడాలకు వరద ప్రమాద హెచ్చరిక నోటీసులు జారీ చేశామని ఇందులో చంద్రబాబు ఇల్లు కూడా ఒకటని అధికారులు చెబుతున్నారు.

ఏ క్షణాన్నయినా ఇళ్లల్లోకి నీరు రావొచ్చని అధికారులు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ బిల్డింగ్ ని ఎలాగైనా కూలగొడతామని అధికార పార్టీ చెప్పేది… అయితే అదే కరకట్టలో బీజేపీ నాయకుడి గెస్ట్ హౌస్ కూడా ఉండటంతో సైలెంట్ అయిపోయింది. అప్పటి నుండీ చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది అంటూ తరచు నోటీసులు ఇస్తూ మీడియాలో ప్రచారం వచ్చేలా చేస్తుంది.

గత ఏడాది కృష్ణా నదికి వచ్చిన వరద కారణంగా అధికార పార్టీ కోరుకున్నది జరగలేదు… ఈ సారైనా జరుగుతుందేమో చూడాలి. కాగా… పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర నుండి కృష్ణా జిల్లా వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దానితో కృష్ణా నది ఉగ్రంగా ప్రవహిస్తుంది.