Chandrababu Naidu fires on national media exit poll survey on andhra pradeshఅదేంటో తెలీదు…. ఆంధ్రప్రదేశ్ మీద సర్వేలు అనేటప్పటికి వైఎస్సాఆర్ కాంగ్రెస్ భారీ విజయం అంటూ తీర్మాణం చేసేస్తాయి. గతం 2014కు ముందు కూడా అదే చేసాయి. అయితే ఫలితం రివర్స్ అయ్యింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా సర్వేలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు జగన్‌కు అలవాటేనని.. ఆ సర్వేలతో ప్రజాదరణను తారుమారు చేయలేరన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే ఈ సర్వేలలో నిజం ఎంతో తెలీదు గానీ ఒక్క విషయంలో మాత్రం ఈ సర్వేలు సరిగ్గా లేవని క్లియర్ గా చెప్పవచ్చు.

నిన్నటి రిపబ్లిక్ టీవీ సర్వేనే తీసుకుంటే బీజేపీకి 7.2% ఓట్లు వస్తాయని, కాంగ్రెస్ కు 9.8% ఓట్లు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ కంటే బీజేపీకి తక్కువ ఓట్లు రావడం కష్టం. పైగా జనసేన, ఇతరులకు కలిపి 8.6% ఓట్లు ఉన్నాయని చెప్పింది ఈ సర్వే. కాంగ్రెస్ కు జనసేన కంటే ఎక్కువ రావడం అనేది జరగని పని. బీజేపీకి కూడా జనసేనతో సమానంగా రావడం అనేది అసంభవం. ఈ సర్వే ప్రకారం వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు 19 సీట్లు, టీడీపీకి 6 సీట్లు వస్తాయి. అయితే కాంగ్రెస్, బీజేపీ, జనసేన విషయంలో చెప్పిన వాటి తరువాత సీట్ల గురించి నమ్మడం అంటే కష్టమే.

దీని ప్రకారం జాతీయ మీడియాను చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నట్టు జగన్ మేనేజ్ చేస్తున్నారా? బీజేపీని వీడటం వల్ల టీడీపీకి తొక్కేయాలని ఇటువంటి సర్వేలను బీజేపీ కావాలని తెర మీదకు తెస్తుందా? లేక అసలు దక్షిణాది రాష్ట్రాల పల్స్ పట్టుకోవడంలో జాతీయ సంస్థలు విఫలం అవుతున్నాయా? నిజంగా దొంగ సర్వేలు అయితే ఈ సారి కాంగ్రెస్, బీజేపీ, జనసేన లెక్కలు సరి చేసుకుని ఇటువంటి సర్వేలు వేస్తే జనం నమ్మే అవకాశం ఉంటుంది. ఒకవేళ దక్షిణాది పల్స్ వీరు పట్టలేక పోతున్నారంటే మాత్రం జాతీయ సంస్థలు అని చెప్పుకోవడం అంతటి దౌర్బాగ్యం ఇంకొకటి లేదు.