Chandrababu naidu fires on Nagarjuna Akkineni మొన్న మంచు విష్ణు, నిన్న నాగార్జున ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తన లోటస్ పాండ్ ఇంటికి వెళ్లి కలవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. నేరస్థులతో సినీనటుల భేటీ దురదృష్టకరమన్నారు. దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కేంద్రంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, వైకాపాలో ప్రస్తుతం పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని ఆక్షేపించారు. దీని బట్టి సినీ నటులను తెరాస ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేసి వైకాపాకు మద్దతుగా పంపుతుందని టీడీపీ వాదనగా ఉందని తెలుస్తుంది.

నిన్న నాగార్జున జగన్ ను కలవగానే ఆయన గుంటూరు లోక్ సభ సెగ్మెంటుకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ తరువాత నాగార్జున దీనిపై క్లారిటీ ఇచ్చారు. “జగన్‌ను కలవడంలో రాజకీయ ఉద్దేశం లేదు… నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. ఇతరులెవరికీ టిక్కెట్టు కోసం రాలేదు… జగన్‌ మా కుటుంబానికి సన్నిహితుడు.. పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చా,” అని చెప్పారు ఆయన.

దీనితో నాగార్జున విషయం క్లారిటీ ఇచ్చారనే అనుకోవాలి. చిత్తూరు జిల్లాతో ఎప్పటినుంచో అనుబంధం కలిగివున్న మోహన్ బాబు.. విద్యానికేతన్ పేరుతో అక్కడ ఎడ్యుకేషన్ సర్వీస్ కూడా చేస్తున్నారు. మోహన్ బాబును జిల్లా నుండి పోటీ చేయబోతున్నారని వార్తలు వ్యాపిస్తున్నాయి. అయితే మంచు కుటుంబం ఇప్పటిదాకా దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. గతంలోనే తెలుగుదేశం పార్టీతో ఉంటూ రాజ్యసభ సభ్యుడిగా చేసిన మోహన్ బాబు.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో వచ్చిన మనస్పర్ధలతో లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు సినిమాలు కూడా పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో మళ్ళీ రాజకీయాల మీద దృష్టి పెట్టారు మోహన్ బాబు.