chandrababu naidu fires on Ap governmentతెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభలో తెలుగు జాతిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక విజనరీ ఉన్న నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్ర అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవాలంటే 1995కి ముందు హైదరాబాద్ ని, 95 తరువాత హైదరాబాద్ ని చూడండి… తేడా ఏంటో మీకే స్పష్టమవుతుంది అంటూ నేటి యువతకు చంద్రబాబు తన విజనరీ గురించి పరోక్షంగా తెలియచేసారు.

ఆ రోజులలో ఐటీ అంటే ఏమిటో ఇక్కడి నాయకులకు అవగాహన కూడా లేదు. హైటెక్ సిటీ నిర్మించి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలను హైదరాబాద్ కు పరిచయం చేసి, తెలంగాణా రాష్ట్రానికే ఒక ఆర్ధిక వనరుగా హైదరాబాద్ ను నిలిపిన ఘనత తెలుగుదేశం పార్టీది. బిల్ గేట్స్ ని హైదరాబాద్ కు రప్పించి ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ని ఏర్పాటు చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచపటంలో నిలిపిన ఖ్యాతి తెలుగుదేశం పార్టీ సొంతం.

‘రానని చెప్పిన వాళ్ళను రప్పించుకోవడం.,’ ‘రప్పించుకున్న వాళ్ళను తప్పించుకోకుండా చూసుకోవడం’ తనకు తెలుసునని., “ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్” ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ కు రప్పించిన చరిత్రను ఈ సందర్భంగా చంద్రబాబు నెమరు వేసుకున్నారు. అదే స్పూర్తితో ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించాలని అమరావతి రాజధానిగా ఎన్నుకోవడం జరిగింది.

ప్రపంచంలో ఎక్కడ లేనంతగా 33 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో రైతులు నా విజనరీని నమ్మి ప్రభుత్వానికి అప్పగించారని., ఈ దుర్మార్గుడు జగన్ వచ్చి అమరావతి పై విషం చిమ్మారని., వర్షాలు వస్తే ఇక్కడి ప్రాంతం ముప్పునకు గురవుతుందని చెప్పిన ‘కరకట్ట కమల్ హాసన్’ ఇప్పుడు ఎక్కడా., అంటూ బాబు చమత్కరించారు.

రాజకీయాలలో యువతకు, మహిళలకు పెద్ద పీట వేసిన పార్టీ తెలుగుదేశం. రాబోయే ఎన్నికలలో 40% సీట్లు యువతకే కేటాయిస్తామని, ఆసక్తి ఉన్న వారు ఎటువంటి రాజకీయ వారసత్వం లేకపోయినా తమను సంప్రదించవచ్చని చెప్పి వారికి రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తిని పెంచారు. యువత, మహిళలే తమ పార్టీకి అండా-దండా అంటూ ఉత్తేజపరిచారు.

తన రాజకీయ అనుభవంలో ఎందరో ముఖ్యమంత్రులను చూసాను కానీ, ఈ జగన్ మోసపు రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని చూడలేదంటూ జగన్ పై ఫైర్ అయ్యారు. 48 వేల కోట్ల రూపాయలకు వైసీపీ ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవని సిఏజి (కాగ్) ఇచ్చిన నివేదికపై నంగి నంగిగా సమధానం చెప్తున్నా, ఈ ప్రభుత్వం దొంగ లెక్కలు రాయడంలో సిద్దహస్తులని ప్రజలందరికి అర్ధమైయ్యింది అంటూ చంద్రబాబు జగన్ పై విమర్శనాస్త్రాలు వదిలారు.ఆ లెక్కలు ఎక్కడ.., మీ ఇంటి దగ్గరా అంటూ వ్యంగ్యంగా చురకలు వేశారు.

ఆ రోజులలోనే విజన్ 2020 అంటూ దేశాలన్ని తిరిగి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చిన చరిత్ర నాది. 16 నెలలు అక్రమ కేసులలో జైలుకు వెళ్లివచ్చిన చరిత్ర జగన్ ది అంటూ జగన్ ను ఎద్దేవా చేసారు చంద్రబాబు. విజన్ 2020 గురించి ఈ 420 గాళ్లకు ఏం తెలుస్తుంది తమ్ముళ్లు.., అంటూ చంద్రబాబు సభలో పంచ్ డైలాగ్స్ పేల్చారు.