chandrababu naidu craze in chinaనవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’ నిర్మాణంతో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అలాగే, సింగపూర్, జపాన్, చైనా వంటి దేశాలలో పర్యటించి… ఏపీలో పెట్టుబడులకు గల సానుకూల అంశాలను సమగ్రంగా వివరించారు. అలాగే చంద్రబాబు పర్యటనలకు ప్రతిఫలంగా పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ జాబితాలో మన పొరుగు దేశం చైనా ముందు వరుసలో ఉంది. చంద్రబాబు పర్యటన తర్వాత చైనాకు చెందిన ‘జియోమీ’ సంస్థ విశాఖలో తమ ఉత్పత్తిని ప్రారంభించిన విషయం తెలిసిందే.

అంతే కాదు, చంద్రబాబు ప్రభావం చైనాలో ఎంతుందనేది ‘గూగుల్’ తాజా నివేదికలో వెల్లడించింది. చైనా దేశ ప్రజలు ‘గూగుల్’లో సెర్చ్ చేసిన ప్రముఖుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా రెండవ స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచారు. చంద్రబాబుకు ప్రపంచవ్యాప్తంగా మంచి కీర్తి ప్రతిష్టతలు ఉన్న విషయం తెలిసిందే గానీ, అనూహ్యంగా ఈ స్థానంలో నిలుస్తారన్నది మాత్రం ఊహించినది. చైనాలోనూ హాంగ్ కాంగ్ నగరంలో ఎక్కువగా చంద్రబాబు గురించి వెతికారట.

భద్రత కారణాల పేరుతో 2010లో ‘గూగుల్’ సెర్చ్ ఇంజిన్ ను చైనా నిషేధం విధించగా, ఇటీవలే ఆ నిబంధలను సవరించింది. చైనా తర్వాత చంద్రబాబు గురించి వెతికిన జాబితాలో అమెరికాలోని న్యూజెర్సీ, వర్జీనియా, టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూయార్క్ నగరాలు ఉన్నట్లు ‘గూగుల్’ తెలిపింది.