YSRCP-Activists-Try-to-Obstruct-Chandrababu's-Convoy-in-Kuppamఆంధ్రప్రదేశ్ లో క్రైసిస్ సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో ప్రజలలో సరైన స్థాయిలో ధైర్యం నింపడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో జగన్ ఉన్నారు. వచ్చిన ప్రతీ సారీ ఏదో ఒక తప్పు దొరలి అభాసుపాలు అవుతున్నారు.

మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చి ప్రజలతో నిరీక్షణం జాగ్రత్తలు చెబుతున్నారు. తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక స్టడీని ఉటంకిస్తూ మనం జాగ్రత్తగా ఉండకపోతే… కరోనా వల్ల 20 కోట్ల నుండి 30 కోట్ల మంది బారిన పడి 20 లక్షల నుండి 50 లక్షల మంది చనిపోతారు కావున ప్రజలు బయటకు రాకూడదు అని చెప్పారు.

అయితే దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ వక్రీకరించే పనిలో పడింది. కరోనా వల్ల 20 కోట్ల నుండి 30 కోట్ల మంది బారిన పడి 20 లక్షల నుండి 50 లక్షల మంది చనిపోతారు అని ప్రజలను భయపెడుతున్న చంద్రబాబు నాయుడు అంటూ ప్రచారం చేస్తుంది. తమకు అనుకూలమైన విధంగా చంద్రబాబు వీడియోని కట్ చేసి దుష్ప్రచారం చేస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది.

ఇది ఇలా ఉండగా తెలంగాణాలో ఈరోజు మూడు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసులు 36కు చేరాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఒక కొత్త కేసు నమోదు అయ్యింది. దీనితో మొత్తం కేసులు ఏడుకు చేరాయి. దేశవ్యాప్తంగా ఆ సంఖ్య 500కు అటూఇటుగా ఉన్నాయి.