జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ ల మధ్య చంద్రబాబు కూర్చుని ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తండ్రి మరణంతో కృంగిపోయిన జూనియర్, కళ్యాణ్ రామ్ లను ఓదార్చిన చంద్రబాబు, కష్టకాలంలో వారి వెంటే ఉండి, మనోధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసారు. అలాగే ఎన్టీఆర్ కు ఎదురుగా బాలయ్య ఉన్న ఈ ఫోటోలో నిశబ్ధం తాండవిస్తోంది.
అనుకోని విధంగా జరిగిన ఈ సంఘటనతో ఒకరినొకరు పలకరించుకోవడానికి మాటలు రావట్లేదేమో గానీ, అంతా తలలు వంచుకుని కూర్చున్నారు. ఆపద సమయంలో మన వెంట ఉండేవారే మనకు అసలైన బంధువులు, సన్నిహితులు అని చెప్పడానికి నిదర్శనంగా ఈ ఫోటోను పేర్కొనవచ్చు. హరికృష్ణ పోస్ట్ మార్టం పూర్తి కావడంతో భౌతికకాయం హైదరాబాద్ పయనమైంది.
రోడ్డు మార్గంలో వెళ్తోన్న హరికృష్ణ భౌతికకాయంతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చంద్రబాబు, బాలకృష్ణ వంటి కుటుంబ సభ్యులతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఇంకా పలువురి విఐపీ వాహనాలు కూడా ఫాలో అవుతుండడంతో మెహిదీపట్నంలోని హరికృష్ణ ఇంటికి వెళ్ళే మార్గమైన ఎల్బీనగర్, దిల్ షుఖ్ నగర్, మలక్ పేట, నాంపల్లి, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు.