Municipal Administration, Commissioner, G Vijayakumar raised the issue in a high-level meeting with the CM and told him how South Korea conducted elections for their National Assembly even during the Pandemic.కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కుప్పం వైకాపా నియోజకవర్గ ఇన్ ఛార్జి కృష్ణ చంద్రమౌళి నిన్న రాత్రి చనిపోయారు. ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహించిన ఆయన పదవీ విరమణ అనంతరం కుప్పం వైఎస్సార్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు. 2014, 2019లో రెండు పర్యాయాలు మాజీ ముఖ్యమంత్రి, స్థానిక శాసనసభ్యుడు చంద్రబాబుపై పోటీచేసి ఓటమి పాలయ్యారు.

గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంలో అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ లో చికిత్స చేయించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఆయన ప్రచారానికి కూడా వెళ్ళలేదు. చంద్రమౌళి మృతిపట్ల చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఆయన మరణ వార్త బయటకు వచ్చిన కొద్ది నిమిషాలలోనే తన ట్విట్టర్ ఎకౌంటు నుండి సంతాపం తెలియజేశారు చంద్రబాబు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే చంద్రమౌళి జేబుకు వైఎస్సార్ కాంగ్రెస్ బ్యాడ్జీ ఉన్న ఫోటో ను చంద్రబాబు తన ట్విట్టర్ ఎకౌంటు లో పోస్టు చేశారు. మా బాబుకు అసలు ఇన్సెక్యూరిటీ అనేది ఉండదు అంటూ మురిసిపోయారు టీడీపీ అభిమానులు.

ఇది ఇలా ఉండగా… చంద్రమౌళి స్థానంలో ఆయన కుమారుడిని వైఎస్సార్ కాంగ్రెస్ కుప్పం ఇంఛార్జ్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 2019 ఎన్నికల సమయంలో తండ్రి అనారోగ్యంతో ఉండగా ఆయనే ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.