Chandrababu Naidu-Commitment  towards andhra pradeshజగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కలలకు తాత్కాలికంగానైనా బ్రేక్ పడింది. మండలిలోని తమ ఆధిక్యతతో టీడీపీ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించింది. దీనితో మూడు నాలుగు నెలల జాప్యం తప్పకపోవచ్చు. ఇది ఇలా ఉండగా మండలిలో టీడీపీ వ్యూహాన్ని అడ్డుకునేందుకు జగన్ ఇరవై మంది మంత్రులను మోహరించినా ఉపయోగం లేకుండా పోయింది.

మొదటి రోజు రూల్ 71 అని, రెండో రోజు సెలెక్ట్ కమిటి అని ప్రతిపక్షం పాలకపక్షాన్ని నిలువరించింది. రూల్ బుక్ లో ఉన్నప్పటికీ ఇప్పటివరకూ దేశంలో ఎక్కడా వాడని రూల్ 71ని తెర మీదకు తేవడానికి సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ సలహా కారణం అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

దీనిగురించి జంధ్యాల రవిశంకర్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “పోలీసులు అరెస్ట్ చేసి ఊరంతా తిప్పుతుంటే మండలిలో లీగల్ విషయాల గురించి అయిన నాతో 30 సార్లు ఫోన్లో మాట్లాడారు. రాత్రి 1.40 కి చివరి కాల్ మళ్ళీ పొద్దునే 6.30 కి మొదటి కాల్. రాష్ట్రం గురించి, జనం గురించి చంద్రబాబు గారి కమిట్మెంట్ వేరే లెవెల్,” అని ఆయన చెప్పుకొచ్చారు.

మొత్తానికి చంద్రబాబు వ్యూహ చతురత ముందు జగన్ ప్రభుత్వం నిలవలేకపోయింది అనేది మాత్రం మరో సారి తేలిపోయింది. మరోవైపు తమకు కొరకరాని కొయ్యిగా మారిన మండలి రద్దుపై చట్టపరంగా ఆలోచన చేస్తాం.. ఎన్ని అడ్డంకులు వచ్చినా మేం ముందుకు వెళ్తాం అని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముఖంగా చెప్పడం గమనార్హం.