Chandrababu Naidu Chanllenges on YS Jagan in Assemblyవిపక్ష నేత వైఎస్ జగన్ కోరినట్టుగా అగ్రిగోల్డ్ లావాదేవీలు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసిన ఆస్తుల విషయమై జ్యుడీషియల్ విచారణ జరిపించేందుకు సిద్ధమని, ఒకవేళ విచారణ తరువాత ప్రత్తిపాటి పుల్లారావు తప్పుందని తేలితే, ఆయన్ని సభ నుంచి వెలేస్తానని, ఆరోపణల్లో నిజం లేదని రుజువైతే, జగన్ ఇక జీవితంలో సభకు రాకూడదని, ధైర్యముంటే తన సవాల్ ను అంగీకరించాలని సీఎం చంద్రబాబు ఆగ్రహంతో డిమాండ్ చేశారు.

“ఈ హౌస్ లో ఎవరైనా ఒకరే ఉండాలి, ఉంటే ప్రత్తిపాటి, లేదంటే జగన్ ఉండాలి. విచారణ వేసి తేలుద్దామా? నా మాటలకు జగన్ అంగీకరించే పక్షంలో జ్యుడీషియల్ విచారణకు ఈ క్షణమే ఆదేశిస్తున్నా” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగే ప్రతిపక్ష పార్టీ అధినేత నోటికి అదుపు లేకుండా పోయిందని, తనను అనరాని మాటలు అంటున్నారని చెప్తూ… ఇటీవల కాలంలో బహిరంగ సభలో తనను చెప్పుతో కొట్టమన్న సంఘటనను గుర్తు చేసారు ముఖ్యమంత్రి.

“చెప్పుకోకూడదు కానీ, నన్ను అనరాని భాషలో… దేంతో కొట్టమన్నారో కూడా మీరూ విన్నారు. నా నోటి గుండా చెప్పలేకపోతున్నాను. మామూలుగా అయితే ఆ మాట ఒక ఎమ్మెల్యేను సామాన్య వ్యక్తి కూడా అనలేడు. అలాగే సామాన్యులు కూడా ఒకరినొకరు అనుకోలేరు. ఎవరికైనా రోషం ఉంటుంది. మనకు కూడా రక్తం, మాంసం… ఒక ఆలోచన, ఒక విధానం, జీవితం ఇవన్నీ ఉన్నాయి. అయినా ఆ మాటలను ఎందుకు భరించానంటే.. ప్రజల కోసమేనని” ఆవేదన వ్యక్తం చేసారు చంద్రబాబు.