TDP - Chandrababu Naidu - YSR Congress - YS jaganమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తరచు వినిపించే విమర్శ ఆయన ఇది వరలో ఎప్పుడు వ్యవసాయం దండగ అన్నారట. వైఎస్ రాజశేఖరరెడ్డి దానిని తెరమీదకు తెచ్చారు. అయితే తొలినాళ్లలో సరిగ్గా తిప్పికొట్టకపోవడం తో అసలు ఎప్పుడు అన్నారో తెలియని ఆ వ్యాఖ్య ప్రతిపక్షాలకు ఊతపదం అయిపోయింది.

ఈరోజు అసెంబ్లీ లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్… మండలిలో మరో మంత్రి బొత్స సత్యనారాయణ తమ ప్రభుత్వం పై వస్తున్న విమర్శల పై సమాధానం చెప్పకుండా చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగ అన్నారు ఆయనకు మా గురించి మాట్లాడే హక్కు లేదు అంటూ విమర్శించే ప్రయత్నం చేశారు. దీనిపై చంద్రబాబు స్పందించారు.

“నేను అనని మాటలు అన్నారని ఆరోపిస్తున్నారు. గతంలో వైఎస్ కు ఇదే సవాలు విసిరా.. అన్నా అని నిరూపించండి రాజీనామా చేస్తా లేకపోతే మీరు రాజీనామా చెయ్యండి అన్నా… అప్పుడు ఆయన మాట్లాడకుండా తప్పించుకున్నారు. ఇప్పుడు అదే సవాలు విసురుతున్నా నిరూపించండి. ఊరికే విమర్శలు చెయ్యడం కాదు,” అని చంద్రబాబు విమర్శించారు.

మండలిలో మంత్రి బొత్స కు నారా లోకేష్ కూడా అదే రకమైన సవాలు విసిరారు. రెండు సార్లు అధికారపక్షం వారు వారిని మాట్లాడకుండా అడ్డుపడే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్ కూడా తీసుకొని సవాలు ని జగన్ తీసుకుని నిరూపిస్తే చంద్రబాబు అడ్డు తొలగించుకోవచ్చు. ప్రయత్నిస్తారేమో చూద్దాం.