Chandrababu Naidu  cabinet expansionఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తానికి తన మనసులో మాట బయటపెట్టారు. తొందర్లోనే ముస్లింను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నామని, దాని సంబంధించిన కసరత్తు ఇప్పటికే జరుగుతుందని ఆయన ప్రకటించారు. దీనితో ఎన్నికలకు తొమ్మిది నెలలు ఉండగా మంత్రి వర్గంలో మార్పులు చోటు చేసుకోవచ్చని తెలుస్తుంది.

అయితే బీజేపీ మంత్రుల రాజీనామాతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. కేవలం ఒక ముస్లిం ని తీసుకోవడం ద్వారా ఈ తంతు పూర్తి చేయ్యాలని పూర్తి స్థాయిలో చేస్తే అనవసరమైన తలనొప్పులు వస్తాయని ఆయన భావిస్తున్నారు. ఎన్డీయేతో ఘర్షణ పడుతున్న నాటి నుండి ముస్లింలు టీడీపీ వైపు చూస్తున్నారు.

దీనితో చంద్రబాబు ఈ పని చెయ్యాలని సంకల్పించారట. తెలుగు దేశం పార్టీలో ముస్లిం ఎమ్మెల్యేలు లేరు దీనితో పార్టీలోని సీనియర్లు మంత్రివర్గంలో చోటుపై ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గంలో ఎక్కువ చేర్పులు లేకపోయినా శాఖలలో మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.