Chandrababu Naidu Biopic - Chandrodayam First Lookఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితకధ ఆధారంగా “చంద్రోదయం” రూపొందిస్తున్న బయోపిక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. చడిచప్పుడు లేకుండా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా 80 శాతం పూర్తి చేసుకుంది. అంతేకాదు అక్టోబర్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నామని ప్రకటన కూడా చేసారు.

అయితే ఫస్ట్ లుక్ అంటూ విడుదల చేసిన పోస్టర్ తెలుగుదేశం ప్రచార కార్యక్రమాలకు విడుదల చేసే బ్యానర్ పోస్టర్ మాదిరి ఉంది తప్ప, అది “చంద్రోదయం” సినిమాకు ఏ మాత్రం ఉపయోగకరంగా లేదు. దీని కంటే అభిమానులు సోషల్ మీడియా సర్క్యూలేట్ చేసే పోస్టర్లు చాలా ఉత్తమంగా ఉంటాయి. దీని ద్వారా చంద్రబాబు పేరు నిలబడుతుందో లేదో గానీ, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం పేలవంగా ఉంది.

అందులోనూ మరో పక్కన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతుండడం, అందులో సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండడంతో… ఇప్పటికే ‘యాత్ర’ ప్రతిష్టాత్మకంగా మారింది. ఇద్దరూ సమకాలీకులు కావడంతో, ఈ రెండు బయోపిక్ లను పోల్చడం సహజం. అయినా ప్రేక్షకులలో పెద్దగా గుర్తింపు లేని వారి చేతికి చంద్రబాబు బయోపిక్ ఎలా వెళ్లిందో?!