Chandrababu Naidu  best chief minister for Andhra pradeshవిభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దేశంలోనే అత్యంత అనుభవజ్ఞడు ఐన రాజకీయనేతల్లో ఒకరు. విభజన అనంతరం లోటు బడ్జెట్ మరియు రాజధాని లేని రాష్ట్రం కోసం నిత్యం శ్రమిస్తున్న శ్రమ జీవీ, చంద్రబాబుకు ఉన్న కష్టాలు ఇవేన అంటే మాత్రం కాదనే చెప్పాలి. ఒకపక్క కలలో కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకునే ప్రతిపక్ష నేత. అదే సమయంలో చెయ్యిస్తే ఎక్కడ పైకి వచ్చేస్తాడో అని భయపడే కేంద్రంలోని కొన్ని శక్తులు. ఏదైన ఒక పని మొదలు పెడదాం అనుకునే సరికి వెంటనే కోర్ట్‌లలో పిటీషన్లు, కులాల మధ్య చిచ్చుపెట్టె పెద్ద మనుషులు.

ఆయన అనుభవం అంత వయసులేని ప్రతిపక్ష నేత ఆయనని పేరు పెట్టి పిలిచిన, కాల్చి చంపండి అని పిలుపునిచ్చిన చేడ్రని నిగ్రహం, ఒకపుడు చక్రం తిప్పిన ఢిల్లీ వీధుల్లో నేడు ఆపాయింట్మెంట్ల కోసం నెలలకొద్ది నిరీక్షింప చేసిన నోరు జారాని వైనం ఒక్క చంద్రబాబుకె చెళ్ళు

ఆ మధ్య ఒక సినిమాలో ఒకడు అంటాడు ‘ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పని’ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది అదే. కొత్త రాష్ట్రాన్ని వడ్డున చేర్చే క్రమంలో అవసరం ఐతే తగ్గుతాడు. తాను తగ్గినా రాష్ట్రాన్ని గెలిపించాలి అనే తపన ఆయనది. ఐతే ఇలా ఎంత కాలం అంటే ప్రజాస్వామ్యంలో 5సంవత్సరాలు. కాల్చామన్న వారిలో మార్పు వచ్చిన రాకపోయినా నేడు చిన్న చూపు చూస్తున్న వారు వెతుక్కుంటూ అమరావతి రావొచ్చు. అదిప్రజాస్వామ్యం అదే ప్రజాస్వామ్యం! అంతవరకూ చంద్రాల సారు మీ ఓపికకు మా జోహార్లు.