Chandrababu naidu begging in machilipatnam for capital amaravati-తెలుగుదేశం పార్టీ అమరావతి ఉద్యమాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. గతంలోలా నాన్చుడు ధోరణితో కాకుండా అమరావతి రైతుల పక్షాన నిలబడాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్తున్న చంద్రబాబు నిన్న పోలీసులు అరెస్టు కూడా చేశారు.

నేడు టీడీపీ, సిపిఐ, అమరావతి పరిరక్షణ సమితి నేతృత్వంలో తలపెట్టిన జిల్లాల బుస్సు యాత్రను శాంతి భద్రతల పేరుతో అడ్డుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా తాను సీఎంగా ఉన్నప్పుడు తండ్రీకొడుకులు పాదయాత్రలు చేశారని.. తాను కూడా అడ్డుకొని ఉంటే వాళ్లు పాదయాత్ర చేసేవాళ్లా అని ప్రశ్నించారు.

ఈరోజు జేఏసీ సమావేశం పూర్తయిన తర్వాత నేరుగా మచిలీపట్నం బయలుదేరి వెళ్లారు చంద్రబాబు. మచిలీపట్నం చేరుకోగానే కోనేరు సెంటర్ లో అమరావతి ఉద్యమానికి జోలెపట్టి కాలినడకన బయలుదేరి విరాళాలను సేకరించారు. ప్రజా చైతన్య యాత్ర మచిలీపట్నంలో ఈరోజు బహిరంగ సభ నిర్వహించనుంది.

ఇప్పటికే అమరావతి పరిరక్షణ సమితికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన రెండు గాజులను విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా అమరావతి రైతుల ఆందోళన నేడు 23వ రోజుకు చేరింది. రాజధాని మార్పు నిర్ణయంతో మనస్థాపం చెంది 11 మంది రైతులు ఇప్పటిదాకా గుండెపోటుతో చనిపోయారు అని టీడీపీ ఆరోపిస్తుంది.