Chandrababu Naidu at demolished Praja Vedikaఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వంటనే ప్రజావేదికను కూల్చి వేశారు. అది నదీ పరీవాహక ప్రాంతంలో నిబంధనలు కు విరుద్ధంగా నిర్మించింది అని ఇప్పటి ప్రభుత్వం వాదన. సరే ఇవే నిబంధనలు అన్ని అక్రమ నిర్మాణాలకు వర్తింపచేస్తే జగన్ నిబద్ధతను అందరూ మెచ్చుకునే వారు.

అయితే ఆ ఉత్సాహం చంద్రబాబు ఇంటి వద్దే ఆగిపోయింది. సరే జరిగింది ఏదో జరిగింది. ప్రజా ధనం వృథా అయ్యింది. కానీ ఇందులో ఇంకో కోణం కూడా ఉంది. చంద్రబాబు ఉండవల్లి ఇంటికి వెనుకే ఉండే ప్రజావేదికను తనికి కేటాయించాల్సిందిగా చంద్రబాబు అడిగారు. అయినా దానిని కూలగొట్టారు.

పైగా చంద్రబాబు కు ఈ అవమానం నిత్యం గుర్తు రావాలని కనీసం ఆ కూల్చివేత తరువాత మిగిలిన శకలాలను ఇన్ని నెలల తర్వాత కూడా తీయకుండా అలాగే ఉంచేశారు. చంద్రబాబు ఇంటి బయటకు లోపలకు వెళ్లే ముందు వాటిని చూసి కుమిలిపోవాలని ముఖ్యమంత్రి కోరిక. అయితే అవే శకలాలు జగన్ ప్రతీకారేచ్చకు కూడా నిదర్శనమే కదా?

ఇది ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు ఈరోజు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. టీడీపీ నాయకులతో కలిసి బస్సు లో బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన ముందుగా ప్రజావేదిక శకలాలను చూసే బయల్దేరారు. ఆ శకలాలు జగన్ ఏ ఉద్దేశంతో అక్కడ పెట్టించినా అవి మాకు జగన్ ను ఓడించాలనే కసిని మరింత పెంచుతుందని టీడీపీ అభిమానులు అంటున్నారు.