Chandrababu -Naidu annadata-sukhibhava schemeతెలంగాణలోని రైతు బంధు పథకాన్ని పోలిన పథకం ‘అన్నదాతా సుఖీభవ’. ఈ పథకం కింద కేంద్రం ఇచ్చే 6 వేల రూపాయలతో కలిపి చిన్నకారు రైతులకు 15 వేలు, మిగతావారికి 10 వేలు పెట్టుబడి సాయం వస్తుంది. మొదటి విడతలో నాలుగు వేల రూపాయిలు రైతుల ఖాతాలలో జమ చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. అయితే ఉన్నఫళంగా ఈ స్కీమ్ కింద తొలి విడత వెయ్యి రూపాయలు నేడో..రేపో ఖాతాల్లో వేయబోతున్నారు. దీని వెనక బలమైన కారణం ఉంది.

ఇప్పటికి ఇప్పుడు రాష్ట్రం దగ్గర ఈ స్కీం కోసం డబ్బులు లేవు. కేవలం ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ అని చెప్పి ‘ఎన్నికల కోడ్’ పరిధిలో రాకుండా చూసుకోవటం కోసమే ఈ ఎత్తు. అంతే కాదు..మార్చిలో మిగతా మూడు వేలు ఇస్తే ఎన్నికలకు నెల ముందు కాబట్టి రైతులు ఆ కృతజ్ణతతో తమకు ఎలాగైనా ఓటు వేస్తారనే ఎత్తుగడ. దీనితో ప్రభుత్వం ఆ ఏర్పాట్లలో ఉంది, ఒక్క ఈ పథకమే కాకుండా ఈ మధ్య కాలంలో చంద్రబాబు ప్రకటించిన అన్ని పథకాలు ముందైతే మొదలు పెట్టేసి ఆన్ గోయింగ్ స్కీమ్ అనిపించుకోవాలని చంద్రబాబు వ్యూహం.

ఇప్పటికే ఈ పథకాల మీద ప్రతిపక్ష పార్టీలో ఎన్నికల కమిషన్ కు కంప్లయింట్ చేశాయి. ఎలాగైనా ఎన్నికల కమిషన్ ఆపుతుందని ఆశగా ఉన్నాయి. అయితే బాబు ఇలా చెయ్యడం వల్ల వాటిని ఆపగలిగే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉండదు. డ్వాక్రా మహిళలకు ఇచ్చే స్మార్ట్ ఫోన్లు కూడా కొన్ని ప్రాంతాలలో లీడర్లకు ఇస్తున్నట్టు సమాచారం వస్తుంది. మరోవైపు ఈ ఫోన్ల టెండర్లు ఖరారు కావడానికి మరికొంత సమయం పడుతుంది. దీనితో కొంత మందికి ఇచ్చేస్తే ఇది కూడా ఆన్ గోయింగ్ స్కీమ్ అని చెప్పవచ్చు.

ఇలా ప్రభుత్వం అనుకున్న ప్రతీ స్కీం ను ఆన్ గోయింగ్ స్కీమ్ గా మార్చే పనిలో ఉన్నారు. ఎన్నికల కోడ్ సమయంలోనే రైతు రుణ మాఫీ మిగతా రెండు వాయిదాలు రైతుల ఖాతాలలో జమ చెయ్యబోతున్నారు. దీనితో ఎన్నికల ముందే రాష్ట్రంలోని మేజర్ వర్గాలకు భారీగా సొమ్ములు అందే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజో రేపో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి కోడ్ అమలు లోకి వస్తుంది. అది ముగియక ముందే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది. దీనితో ఈరోజో రేపో కోడ్ వచ్చేసినట్టే అనుకోవాలి.