Chandrababu Naidu - Polavaram Projectబీజేపీ మొత్తానికి తెగేదాకా లాగినట్టు కనిపిస్తుంది. విభజన హామీల విషయంలో ఒక్కో హామీ పై వెనక్కు తగ్గిన. సాక్షాత్తు ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా జగన్ ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడిన చంద్రబాబు మౌనంగా ఉన్నదీ ఆ పోలవరం నిధుల కోసమే. చివరికి ఆ ప్రోజెక్టుకే అడ్డుపుల్లలు వేస్తుంటే ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

నిధులు ఇవ్వము అంటే చెప్పండి నమస్కారంపెట్టి తప్పుకుంటాం అనడం సంచలనం సృష్టించింది. తప్పుకోవడం అంటే ఏంటి అని ఒక ఛానల్ ప్రతినిధి అడిగితే మీరే చూసారుగా కొద్దీ రోజులు అని చెప్పకనే చెప్పారు ఆయన. చంద్రబాబులో ఫైర్ చూసి మరి అధిష్టానమే పంపిందో లేక వారే వచ్చారో బీజేపీ నాయకులూ హుటాహుటిన వెళ్ళి ఆయన్ని కలిశారు.

నాకు చెప్పేదానికంటే వెళ్లి కేంద్రంతో మాట్లాడి నిధులు వచ్చేలా చుడండి అని చంద్రబాబు వారికి ఒకింత కఠినంగానే చెప్పారు. పోలవరం విషయంలో సమస్య ఎక్కడుందో నాకే అర్థం కావట్లేదు అని అయన మాటలు బట్టి రాజకీయ కారణాలే ప్రాజెక్టుకు సహకరించకుండా చేస్తున్నాయి అనే విషయం చెప్పకనే చెప్పారు.

కేంద్రం వైఖరి మార్చుకోకపోతే జనవరిలో విడాకులు తప్పకపోవచ్చు అని సమాచారం. మరోవైపు పోలవరం కాంట్రాక్టుకు సంబందించి,కొత్తగా కొన్ని టెండర్లు పిలవాలని రాష్ట్రం తలపెట్టగా కేంద్రం ఆపాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రం మాత్రం ఆ టెండర్ల ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి కేంద్ర వైఖరి ఎలా ఉండబోతుందో చూడాలి!