Chandrababu Naidu - Andhra Pradesh Districts Divisionఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జిల్లాల పునర్విభజన చేపట్టనుందా? అవును అని కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాలను 28 జిల్లాలుగా చేయబోతున్నారని సమాచారం. ఒక్క అనంతపురం జిల్లా తప్ప అన్ని జిల్లాలను రెండుగా చేయబోతున్నారని భోగోట్టా. వీటితో పాటు తూర్పు గోదావరి, కృష్ణ, మరియు గుంటూరును రెండుగా కాకుండా మూడుగా చెయ్యబోతున్నారంట.

కరువు జిల్లా ఐన అనంతపురం జిల్లాని ఇప్పుడు ఉన్నట్టుగా ఉంచితేనే మంచిదని భావన అంట. సంక్రాంతికి నోటిఫికేషన్ రాబోతుందని అంటున్నారు. అయితే ఈ వార్తలను గవర్నమెంట్ ఇప్పటిదాకా ధ్రువీకరించలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు పక్కనే ఉన్న తెలంగాణాలో ఇప్పటికే జరిగిపోయింది. కొత్త రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు మంచిదే.

అయితే విభజనానంతరం ఎన్నో సమస్యలతో పోరాడుతున్న రాష్ట్రానికి ఇదో కొత్త తలపోటుగా పరిణమించే అవకాశం ఉంది. ఒకసారి జిల్లాల పునర్విభజన చేపడుతున్నారని తెలిస్తే కొత్త జిల్లాల కోసం ఉద్యమాలు మొదలు అవుతాయి. అదే విధంగా కొత్త జిల్లాలు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

మిగులు రాష్ట్రమైన తెలంగాణా కూడా ఈ విషయంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉంది. అదే కాకా చాలా న్యాయపరమైన చిక్కులు కూడా వస్తాయి. ఈ విషయంలో కేంద్రం సహకరించక తెలంగాణాలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.