వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండీ అమరావతి జీవకళ కోల్పోయింది. అక్కడ జరుగుతున్న కట్టడాలన్నీ ఒక్కసారిగా ఆపేశారు. మరోవైపు అమరావతిని భవిష్యత్తుని నిర్ణయయించడానికి ఒక కమిటిని కూడా ఏర్పాటు చేశారు. మంత్రుల మాటలను బట్టి రాజధానిని వేరే ప్రాంతానికి తరలించడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇది ఇలా ఉండగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతి గ్రామాలలో ఈ నెల ఇరవై ఎనిమిదిన పర్యటించబోతున్నారు. అమరావతిలో తన హయాంలో జరిగినపనులను ఆయన సందర్శిస్తారని సమాచారం. కొద్ది రోజుల క్రితం పార్టీ ఎమ్మెల్యే అచ్చన్నాయుడు ఆధ్వర్యంలో ఒక తెలుగుదేశం బృందం పర్యటించింది.

సగం పూర్తయిన నిర్మాణాలు, దాదాపుగా పూర్తయిన నిర్మాణాలు అన్నింటినీ చంద్రబాబు పరిశీలించనున్నారు. అదే సమయంలో రాజధాని ప్రాంత గ్రామాల ప్రజలు, రైతులతోనూ మాట్లాడనున్నారు. రాజధానిని మార్చే ప్రతిపాదన ప్రభుత్వం తెరమీదకు వస్తే తాము రైతుల పక్షాన పోరాడతామని చంద్రబాబు భూములిచ్చిన రైతులకు భరోసా ఇవ్వబోతున్నారట.

చంద్రబాబు రాష్ట్రమంతా పర్యటించి ఇటీవలే వచ్చిన ఘోరమైన ఫలితాలను సమీక్షిస్తున్నారు. దానితో వివిధ జిల్లాలలో పర్యటిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నారు. కాగా సోమవారం నాడు ఆయన కడప జిల్లాలో పర్యటించనున్నారు.