Chandrababu naidiu situation 2016రాష్ట్ర విభజన తర్వాత 2014లోకి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాధ్యతను నెత్తికెత్తుకుంది. అయితే విభజన ద్వారా సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గాలకు ఆటంకాలుగా మారాయి. దాదాపు 17 మాసాలు గడుస్తున్నా, రాష్ట్రంలో అభివృద్ధి గాడిలో పడకపోవడానికి విభజన సమస్యలు, ఆర్ధిక లోటే కారణాలు. అయితే వీటన్నింటిని రూపుమాపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కానీ, ఏపీకి సంబంధించిన అంశాలపై ఏ విధంగా స్పందిస్తుందో అందరికీ తెలిసిన విషయమే.

ఇలా ఎన్ని కారణాలు చెప్పినప్పటికీ, అభివృద్ధికి సంబంధించి మొదటి జవాబుదారుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి 17 నెలలుగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్న చంద్రబాబు, ఈ ఏడాదిలో శంకుస్థాపనల ద్వారా వాటికి ముహూర్తాలు పెట్టారు. ఇటీవల జరిగిన అమరావతి శంకుస్థాపన మొదలు నేడు చేసిన దుర్గ గుడి, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ల వరకు అంతా సజావుగా నిర్వహించారు. అయితే తలపెట్టిన కార్యక్రమాలన్ని అమలు చేయాల్సిన సంవత్సరంగా 2016 మారింది.

ఓ రకంగా 2016వ సంవత్సరం చంద్రబాబు పాలన పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచేదిగా మారుతుందా? లేక ఉన్న విశ్వాసాన్ని తగ్గించేదిగా మారుతుందా? అన్న ఆసక్తి రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లో కూడా వ్యక్తమవుతోంది. రాజధాని నిర్మాణంతో పాటు ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న పెట్టుబడుల కంపెనీలు కూడా 2016లోనే ప్రారంభానికి నోచుకున్నాయి.

ప్రస్తుత ప్రణాళికలన్నీ కార్యరూపం దాలిస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురుండదన్న భావన కార్యకర్తల్లోనూ చంద్రబాబు నింపినవారవుతారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు తెలుగుదేశం పార్టీకి మరియు చంద్రబాబుకు 2016వ సంవత్సరం చాలా కీలకంగా మారనుంది.