Chandrababu Naidu satire on kanna Lakshminarayanaమహానాడు చివరిరోజున కూడా చంద్రబాబు కేంద్రంపై నిప్పులు చెరిగారు. మోసపూరిత మాటలతో కాలం గడుపుతూ అమరావతి నగర నిర్మాణానికి నిధులు ఇవ్వకుంటే తాము పన్నులెందుకు కట్టాలని చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు కూడా చురక అంటించారు.

“ఆఖరు నిమిషంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మారిన ఓ వ్యక్తి.. బీజేపీకి అద్దె మైకు, వైకాపాకు సొంతమైకులా మాట్లాడుతున్నారు,” అంటూ చంద్రబాబు కన్నాను ఎద్దేవా చేశారు. రాజధానిలో రైతులు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసిన అనంతరం 5 వేల ఎకరాలను విక్రయించుకుని రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకునే అవకాశముందని సీఎం తెలిపారు.

95 వేల కోట్లతో గుజరాత్‌లో డోలేరో నగరాన్ని నిర్మించుకుంటున్న భాజపా నేతలు.. ఓ విగ్రహానికి ఇచ్చినన్ని నిధులు కూడా అమరావతికి ఇవ్వరా? అని ప్రశ్నించారు. సమాఖ్య స్పూర్తి అంటే ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో 22 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని.. ప్రజల భాగస్వామ్యంతో.. తక్కువ వ్యయంతో నాణ్యమైన నిర్మాణాలే లక్ష్యంగా రాజధాని నిర్మిస్తున్నామని చెప్పా