Chandrababbu naidu suggest tdp leaders not to talk budget 2018కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై స్పందించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్ర ఒత్తిడి ఉంది. ముఖ్యమంత్రి కాస్త అటుఇటూగా ఉన్న అన్ని వైపులా నుండి తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పటికీ స్పందించకపోతే రాజకీయంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయనకు సీనియర్లు, ఎంపీలు తేల్చి చెప్పారు.

దీనిపై సీఎం మాట్లాడుతూ జరిగిన అన్యాయంపై ఆదివారం జరిగే పార్లమెంటరి సమావేశంలో రాజకీయ నిర్ణయం తీసుకుందామని, అయితే, తొందరపడి ఎవరూ ఏది పడితే అది మాట్లాడొద్దని మంత్రులకు సూచించారు. జరిగిన అన్యాయంపై పోరాటం ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంవైపు రాష్ట్ర ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

టీడీపీ – బీజేపీ తెగతెంపులు తప్ప ఏది వారిని శాంతపరిచే సూచనలు కనపడటం లేదు. ఇప్పటికే కొందరు ఎంపీలు చంద్రబాబు ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం అని ప్రకటించి ముఖ్యమంత్రిపై మరింత ఒత్తిడి పెంచారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టీడీపీ – బీజేపీ తెగతెంపులు చేసుకుంటే వైకాపా ఆ పార్టీ పక్కన చేరొచ్చు అని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒకవేళ చేరకపోయినా బీజేపీ చంద్రబాబుని ఇబ్బంది పెట్టొచ్చు. అది కూడా వైకాపాకు లాభమే. ఇప్పటివరకు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై జగన్ మోహన్ రెడ్డి స్పందించలేదు.