Chandraabu Naidu enquired about Atal Bihari Vajpayee Health Conditionఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ మేరకు ఢిల్లీలోని అధికారులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

చంద్రబాబు వాజ్‌పేయీ ఒకప్పుడు కలిసి పనిచేశారు. బీజేపీకి బయటనుండి మద్దతు ఇచ్చిన టీడీపీ వాజ్‌పేయీ ప్రభుత్వానికి అన్ని రకాలుగానూ వెన్నుదన్నుగా నిలిచింది. వాజ్‌పేయీ కూడా చంద్రబాబుకు అమితమైన గౌరవం ఇచ్చి రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరించారు. ఇటీవలే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నా చంద్రబాబు వాజ్‌పేయీ ఆరోగ్యం గురించి ఆరా తీయడం గమనార్హం.

మరోవైపు వాజ్‌పేయీ రేపటికల్లా డిశ్చార్జి అవుతారని కేంద్రమంత్రి విజయ్‌ గోయల్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్‌ విడుదల చేశారని చెప్పారు. మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ ఉందని, వైద్యులు చికిత్స అందించారని తెలిపారు. 93 ఏళ్ల వాజ్‌పేయి.. కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.