బాబు వారి భాషలోనే సమాధానం చెబుతుంటే అధికార పార్టీ వారు జాతిరత్నాలు అయిపోతున్నారుమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగాల శైలి మార్చుకున్నారు. అధికార పార్టీ పై నిప్పులు చెరుగుతూ… ప్రజలకు వారికి మరో సారి ఓటు వేసి మోసపోవద్దు అంటూ అంతే ఘాటుగా హెచ్చరిస్తున్నారు. అయితే దీనిపై అధికార పార్టీ ఉలిక్కిపడటం విశేషం… చంద్రబాబు ను సామాజిక బహిష్కరణ చేయాలి.. నాన్ బెయులబుల్ కేసు పెట్టాలి అనడం విశేషం.

“చంద్రబాబు వ్యవహారశైలిలో విపరీత ధోరణి కనిపిస్తోంది.. ప్రజలు శాశ్వతంగా తన బానిసలుగా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు.. – తన పర్యటనల్లో చంద్రబాబు ప్రజలను అవమానిస్తున్నారు. ప్రజలను అసభ్యంగా,బూతులు ఉపయోగించి చంద్రబాబు మాట్లాడుతున్నారు.. వేడి నీళ్లలో ముంచి తీసిన బాయిలర్ కోళ్లలా చంద్రబాబు లోకేష్ ఉన్నారు,” అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

“70 ఏళ్ల చంద్రబాబు ను సామాజిక బహిష్కరణ చేయాలి.. నాన్ బెయులబుల్ కేసు పెట్టేంతగా చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారు,” అంటూ చెప్పుకొచ్చారు. పాపం ఇన్ని రోజులూ మంత్రుల స్థాయిలో ఉండి దారుణమైన భాష వాడినప్పుడు సజ్జల వంటివారికి ఈ సుద్దులు గుర్తుకు రాలేదు. వారి భాషలోనే సమాధానం చెప్పేసరికి శుద్ధపూసలు.. జాతిరత్నాలు మేము అన్నట్టు నీతులు చెబుతున్నారు అని టీడీపీ వారు అంటున్నారు.

“అప్పుడు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబును నడి రోడ్డు మీద కాల్చి చంపాలి… ఉరితీయాలి అని చెప్పినప్పుడు తమ అధినేతను సజ్జల సామాజిక బహిష్కరణ చెయ్యాల్సింది. ఆ నాన్ బెయిలబుల్ కేసులు ఏవో అప్పుడే పెట్టుంటే ఇంతవరకు వచ్చేది కాదు,” అని వారు సమాధానం ఘాటుగానే చెబుతున్నారు.