మారిన చంద్రబాబు ప్రసంగాల తీరు... వ్యూహాత్మకమేనా

మునిసిపల్ ఎన్నికల సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో పర్యటిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సహజంగా చంద్రబాబు ప్రసంగాలు చాలా సుదీర్ఘంగా.. చప్పగా సాగుతాయని పేరు. ఆయన రాజకీయ ప్రస్థానం అంతా అలాగే సాగింది అయితే తాజాగా ఇప్పుడు చంద్రబాబు తన శైలి మార్చడం విశేషం.

అమరావతి తెచ్చి కృష్ణా, గుంటూరు జిల్లాలకు మాత్రమే మేలు చేశారని ప్రత్యర్ధులు ఆరోపించినా ఆ రెండు జిల్లాలలో కూడా టీడీపీకి సరైన ఫలితాలు రాకపోవడంతో దాని మీదే ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఓటు విషయంలో మరోసారి తప్పు చేస్తే మీ జీవితాలు అధోగతిపాలేనని ప్రజలను హెచ్చరిస్తున్నారు చంద్రబాబు.

మీరు ఏం కోల్పోయారో ఇప్పటికైనా గ్రహించండి… నేను ఓట్లు కోసం రాలేదు.. మీ భవిష్యత్తు గుర్తు చేయడం కోసం వచ్చానని వ్యాఖ్యానించారు. ఎవరికి భయపడకుండా ఓటు వేయండి.. మీ ఓటు దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ బయటకు వస్తాడని చంద్రబాబు ప్రజలకు పిలుపునిస్తున్నారు.

వెళ్లిన ప్రతి చోటా జగన్ ను… అధికార పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను టార్గెట్ చేస్తూ వారి స్టైల్ లోనే తిరిగిస్తున్నారు చంద్రబాబు. ఎప్పుడు చప్పగా సాగే చంద్రబాబు ప్రసంగాలకు స్టైల్ మార్చడం తో టీవీ రేటింగులు బాగా వస్తున్నాయని తెలుస్తుంది. అధినేత ఇదే స్పీడ్ కొనసాగించాలని క్యాడర్ కూడా కోరుకుంటున్నారు.