Chalasani Srinivas on andhra pradesh elections 2019ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మూడు, నాలుగు జిల్లాలు తప్పితే వార్ వన్ సైడే అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అది ఏ పార్టీకి అనేది మాత్రం ఆయన చెప్పలేదు. మొదట్లో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించిన ఆయన, ఆ తరువాత బీజేపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల చీకటి ఒప్పందం బయటపడింది అంటూ టీడీపీ వైపు మొగ్గు చూపినట్టుగా ఉన్నారు.

దీనితో ఆయన తెలుగుదేశం పార్టీ గురించే ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్ధం చేసుకోవాలి. సరిగ్గా రేపటి రోజున నెల తరువాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతాయి. చంద్రబాబు నాయుడుకు మరో అవకాశం ఇస్తారా లేక ఒక్కసారి జగన్ ఒక్క అవకాశం ఇద్దాం అనుకుంటారా అనేది ఆ రోజు ఈ సమయానికి తెలిసిపోతుంది. అదే విధంగా మొట్టమొదటి సారి ఎన్నికలలో పోటీ చేసిన జనసేన భవితవ్యం కూడా తేలిపోతుంది. విశ్లేషకుల ప్రకారం ముక్కోణపు పోటీ అవకాశాలు తక్కువ అని అంచనా.

హంగ్ అసెంబ్లీకు అవకాశమే లేదని ఏదో ఒక పక్షానికి క్లియర్ మెజారిటీ ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ రెండు పక్షాలు ఎన్నికలలో గెలుపు మీద కాన్ఫిడెంట్ గానే ఉండటం గమనార్హం. జగన్ మోహన్ రెడ్డి అయితే ఇప్పటికే నేమ్ ప్లేట్ ప్లేట్ తయారు చేయించేసుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి ఆ మధ్య. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యి ఉంది. వచ్చే నెల 23నే వారి అభిప్రాయం ఏంటి అనేది తెలియబోతుంది.