Chalaki Chanti met with an accidentబుల్లితెర సెన్సేషన్ ‘జబర్దస్త్’ ద్వారా పాపులర్ అయిన చలాకీ చంటి, ప్రస్తుతం ఓ పక్కన సోలోగా షోలు, మరో పక్కన సినిమాలు చేసుకుంటున్నాడు. తాజాగా చంటి ప్రయాణిస్తోన్న కారు యాక్సిడెంట్ గురి కావడం ఆందోళన కలిగించింది. అయితే ఈ ప్రమాదంలో చంటికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని తెలియడం ఊరట చెందే అంశం.

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్ర జాతీయ రహదారిపై చంటి ప్రయాణిస్తున్న కారును వెనుకగా వచ్చిన మరో కారు బలంగా డీ కొట్టింది. ఈ యాక్సిడెంట్ లో చంటి కారు దెబ్బతింది గానీ, చంటికి ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసారు.