Chaavu Kaburu Challaga first glimpseఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ ఆ తరువాత ఆ రేంజ్ హిట్ కొట్టలేదు. హీరోగా నటిస్తూనే మొన్న ఆయా మధ్య నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో ప్రతినాయకుడిగాను నటించాడు. ఈ సినిమాలో కార్తికేయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఆయన గీత ఆర్ట్స్ కాంపౌండ్ లో చావుకబురు చల్లగా అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో అతను అంబులెన్సు వాన్ డ్రైవర్ బాలరాజు అనే ఫక్తు మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.. ఈరోజు అతని బర్త్ డే సందర్భంగా ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశారు. మాస్ క్యారెక్టర్ కు సంబంధించిన డైలాగ్ డెలివరీ… బాడీ లాంగ్వేజ్ బానే మ్యానేజ్ చేశాడు కార్తికేయ.

తల్లి క్యారెక్టర్ లో ఆమని కీలక పాత్ర పోషించినట్టు ఉంది. కొడుక్కి మందు పొసే సీన్ బావుంది. మొత్తానికి ఫస్ట్ లుక్ టీజర్ బానే ఉందని చెప్పుకోవాలి. గీత ఆర్ట్స్ సినిమా కాబట్టి సినిమా మీద అంచనాలు బానే ఉన్నాయి.
ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. అందాల భామ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.

జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ సినిమాకి కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ పూర్తయింది. త్వరలోనే కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించి, శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసే దిశ‌గా ప్లాన్ చేస్తున్నారు.