central intelligance report on gudivada casinoతెలుగుదేశం పార్టీ నేతలను అడ్డుకోవడం ద్వారా రగిలిన గుడివాడ కేసినో రాజకీయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… గుడివాడ ఉదంతంపై కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖలోని డీఆర్ఐ (డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్) ఇప్పటికే ఓ నివేదిక తయారు చేసిందట.

ప్రముఖ ఏబీఎన్ ఛానల్ చేపట్టిన చర్చలో ఈ డీఆర్ఐ నివేదికలోని అంశాలను ప్రస్తావించారు. 5 రోజుల పాటు నిర్వహించిన కేసినోలో 8200 మందిని లోపలికి తరలించారట. మనిషికి ఎంట్రీ ఫీజు క్రింద 10 వేల రూపాయలు వసూలు చెసారట. హైదరాబాద్ నుండి విశాఖ వరకు అనేక ప్రాంతాల నుండి వీరిని ఈ కేసినో నిర్వాహకులే స్వయంగా వెహికల్స్ పెట్టి తరలించారట.

ఈ కేసినో బుకింగ్స్ కూడా నగదు రూపంలో కాకుండా, వాట్సాప్ గ్రూప్ ల ద్వారా జరిగినట్లుగా డీఆర్ఐకు అందిన సమాచారంగా చెప్పారు. ఎంట్రీ ఫీజు రూపంలో 8200 మందికి గానూ 10 వేల చొప్పున 82 కోట్లు సేకరించగా, 227 కోట్ల లావాదేవీలు కేసినోలో జరిగినట్లుగా డీఆర్ఐ (డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్) అంచనా వేసిందట.

ఈ వీడియోలో ‘సంక్రాంతి సంబరాలు’ అంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిలతో కూడిన ఫ్లెక్సీ బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. అంటే వీరి ప్రమేయం లేకుండానే ఈ కేసినోను 5 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించగలిగారా? ఏపీలో కొత్త సినిమాకు ఒక్క షో అధికంగా వేస్తేనే సాయంత్రానికి ధియేటర్లను సీజ్ చేసిన ఘనత ఏపీ సొంతం.

అలాంటిది తొలి రోజు నుండే ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన ఈ కేసినో గురించి అయిదు రోజుల పాటు ఎవరికి తెలియదంటే నమ్మే స్థితిలో ప్రజలు ఉన్నారా? ఒకవేళ ఇదే నిజమైతే అంత అలసత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉందా? ఇలాంటి అనేక ప్రశ్నలకు తావిచ్చేలా అధికార పక్షం తీరు ఉంటోంది.