Central Government targets 4 Andhra Pradesh ministersకర్నాటక ఎన్నికలపై ప్రధాని మోడీ, బిజెపి ఆద్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తమపై దృష్టి పెట్టవచ్చని చంద్రబాబు వేసిన అంచనా నిజం గా తేలే అవకాశం కనిపిస్తుంది. ఏపీకి చెందిన నలుగురు కీలక మంత్రులను ఇరుకున పెట్టడానికి కేంద్రం సిద్ధం చేసినట్లు సమాచారం. డైరెక్టుగా సీఎం చంద్రబాబును టార్గెట్ చెయ్యకుండా మంత్రులను, కొందరు ఐఏఎస్ అధికారులను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నమట.

ఈ ఏప్రిల్, మే నెలల్లో రాజకీయంగా ఏపీలో ఎన్ని సంచలనాలు నమోదు అవుతాయో వేచిచూడాల్సిందే. కేంద్రం ఎవరిని లక్ష్యంగా చేసుకున్నా దీనివల్ల టీడీపీ మరింత బలపడటం తప్ప వేరే ఉపయోగం కనిపించడం లేదు. తాము హోదా అడుగుతున్నందునే ఇలా చేస్తున్నారని చెప్పుకునేందుకు చంద్రబాబునాయుడుకు ఊతమిచ్చేలా కేంద్రం కదులుతుంది.

మరోవైపు కేంద్రం టార్గెట్ చేసిన ఆ నలుగురు మంత్రులు ఎవరా అనేది ఆసక్తికరమైనది. మరోవైపు ఎపికి న్యాయం చేయాలంటూ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ధర్నా చేసిన తెలుగుదేశం ఎమ్.పిలు కూడా ఇరుకునపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కర్ణాటకలోని తెలుగువారి ఓట్లు పోకుండా అక్కడి ఎన్నికలు అయ్యాక ఇక్కడ సంగతి చూద్దామని కేంద్ర ఉద్దేశమట.