తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ 52 రోజుల స్ట్రైక్ ని ముగించి తమ ఉద్యోగాలలో జాయిన్ అవుదాం అని ముందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి భవిష్యత్తు ఏమిటి అనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
రేపు ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశం లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ తనను ధిక్కరించిన కార్మికులను కాదని ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నారనే అంటున్నారు. అయితే ప్రైవేటీకరణను కేంద్రం అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ఆర్టీసీని ప్రైవేటీకరించాలంటే… కేంద్రం ఆమోదం తప్పనిసరి’… కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
కేంద్రం ఆమోదం లేకుండా ఆర్టీసీ ప్రైవేటీకరణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్రం ఆమోదించిన తర్వాత… ఆర్ఠీసీని మూసివేసుకోవడానికి లేదా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి… 1950 రోడ్డు రవాణా సంస్థ చట్టంలోని 39 వ సెక్షన్ ప్రకారం వీలవుతుందని గడ్కరీ స్పష్టం చేశారు.
అంతేకాదు… ఆర్టీసీల నష్టాలను కేంద్రం భరించబోదని కూడా తేల్చి చెప్పారు. గడ్కరీ ప్రకటన నిరాశానిస్పృహలతో ఆర్టీసీ కార్మికుల పాలిట వరంలా పరిణమించింది. గడ్కరీ ప్రకటన నేపథ్యంలో రేపు కేసీఆర్ ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందని వారు ఆశపడుతున్నారు.
SVP Result: A Wakeup Call To Jagan?
ABN RK: Will MNCs Sign MOUs With CM On Bail?