Central Govt gives shock to Jaganఏపీలో రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్‌ది మొద‌టినుంచి మొండి వైఖ‌రే. ఎట్టి ప‌రిస్థితుల్లో మూడు రాజ‌ధానులు పెట్టాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్‌. అయితే ఇది వ‌ర‌కు తీసుకు వ‌చ్చిన బిల్లుల‌ను వెన‌క్కు తీసుకున్నా.. త్వ‌ర‌లోనే మ‌రో కొత్త బిల్లుతో రావాల‌ని చూస్తున్నాడు. ఈసారి ఎలాంటి టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్స్ రాకుండా.. మూడు రాజ‌ధానుల కోసం బిల్లు తేవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే జ‌గ‌న్ ఇలా ఆలోచిస్తుంటే కేంద్రం మ‌రో ర‌కంగా ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ విష‌యంలో జ‌గ‌న్‌కు షాక్ ఇస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది కేంద్రం. అమరావతినే రాజ‌ధానిగా నిర్ధారిస్తూ నిధులు కేటాయించ‌డం షాకింగ్ గా మారింది. అయితే తాము విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కార‌మే అమ‌రావ‌తిని రాజ‌ధానిగా గుర్తిస్తున్న‌ట్టు తెలిపింది. ఈ మేర‌కు 2022-23 బడ్జెట్‌లో అమ‌రావతికి కేటాయింపులు ప్ర‌క‌టించింది.

ఏపీ రాజధాని అమరావతి అని చెబుతూ.. బడ్జెట్‌లో ప్రొవిజన్‌ను నివేదించింది. ఇక అమ‌రావ‌తిలోనే స‌చివాల‌యంతో పాటు ఉద్యోగుల రెసిడెన్షియ‌ల్ బిల్డింగుల కోసం నిధులు ప్ర‌క‌టించింది. ఇందులో సచివాలయం కోసం రూ.1,214 కోట్లను, ఉద్యోగుల రెసిడెన్షియ‌ల్ బిల్డిండుల కోసం రూ.1,126 కోట్లను కేటాయించింది.

అయితే ఓ వైపు జ‌గ‌నేమో మూడు రాజ‌ధానుల జ‌పం చేస్తుంటే.. కేంద్రం మాత్రం ఇలా షాక్ ఇచ్చిందేంట‌ని అంతా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడు జ‌గ‌న్‌కు, కేంద్రానికి గ్యాప్ వ‌చ్చింద‌నే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే సీబీఐ కేసులు కూడా వేగం పుంజుకున్నాయ‌నే పుకార్లు వ‌స్తున్నాయి. వాటికి బ‌లం చేకూర్చే విధంగా ఇప్పుడు రాజ‌ధాని విష‌యంలో కూడా జ‌గ‌న్‌కు ఇలా షాక్ ఇచ్చారేమో అంటున్నారు.

కాగా ఈ విష‌యం మీద ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నేత‌లు స్పందించ‌లేదు. అస‌లే నిధులు లేక రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి భారంగా ఉంది. ఇలాంటి స‌మ‌యంలో కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల‌ను కాద‌న‌డం ఎందుకులే అని కూడా అనుకుని ఉండ‌వ‌చ్చు. మ‌రి జ‌గ‌న్ ఈ అసెంబ్లీ స‌మావేశాల్లో రాజ‌ధాని విష‌యంపై ఏమైనా ప్ర‌క‌ట‌న చేస్తారా లేదా అన్న‌ది వేచి చూడాలి.