Chandrababu-Naidu-the-Andhra-Pradesh-meets-Arun-Jaitleyకేంద్రం నుండి ఏపీకి మంజూరు కావాల్సిన నిధుల గురించి రాష్ట్రం అన్ని రకాలుగా మొత్తుకుంటోంది. చంద్రబాబు సర్కార్ చేస్తున్న ఒత్తిడికి కేంద్రం నుండి “నిధుల మంజూరు” ప్రకటన అయితే వస్తోంది గానీ, ఏపీ ఎకౌంటులోకి మాత్రం రావడం లేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు దాదాపు రూ.300 కోట్లు విడుదల చేస్తున్నట్లు రెండు నెలల కిందటే కేంద్రం ప్రకటించింది. కానీ, ఆ నిధులు ఇప్పటివరకు ఏపీ ఖాతాలో జమవ్వలేదు. కారణాలు అన్వేషిస్తే మాత్రం… పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత అంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇంత ప్రక్రియ ఉందని తెలిసి కూడా రెండు నెలల క్రితమే ప్రకటన ఎందుకు జారీ చేశారన్నది ప్రశ్నార్ధకమే!

తాజాగా విభజన చట్టంలో భాగంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి రూ.350 కోట్లు.., ఏపీలో వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధికి రూ.50 కోట్ల చొప్పున రూ.350 కోట్లు… మొత్తం 700 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరి ఈ 700 కోట్లు అయినా ఏపీ ఖాతాలో జమ అవుతుందో లేక పేపర్ ప్రకటనకే పరిమితమవుతుందో వేచి చూడాలి.