center sends back telangana  muslim reservation bill  ఎపిలో కాపుల రిజర్వేషన్ బిల్లును ఆపేసిన కేంద్రం తెలంగాణకు కూడా ఇప్పుడు అదే వర్తమానం అందించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ముస్లిం రిజర్వేషన్లు,గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లులను కూడా వెనక్కు పంపినట్టు సమాచారం. కేంద్ర సిబ్బంది శాఖ ఈ మేరకు హోం శాఖకు సిఫారస్ చేసిందని సమాచారం.

గతంలో సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఏదైనా రాష్ట్రంలో రేజర్వేషన్లు 50% శాతానికి మించకూడదని కావున ఈ బిల్లును ఆమోదించలేమని చెప్పి వెనక్కు పంపింది. గిరిజనుల కోటాను 6 నుంచి 9 శాతానికి, ముస్లిం కోటాను 4 నుంచి 12 శాతానికి పెంచాలని అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది.

తెలంగాణలో ఆ రెండు వర్గాల జనాభా అధికంగా ఉన్నందున… కోటాను పెంచాలని కోరింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనిపై కేంద్రంతో సమరానికి సిద్ధం అవుతుంది తెరాస ప్రభుత్వం. వచ్చే బడ్జెట్ సమావేశాలలో ఈ అంశంపై సభను స్తంభింప చెయ్యాలని ముఖ్యమంత్రి తమ ఎంపీలను ఆదేశించినట్టు సమాచారం.