Central Govt Serious on Jagan Govtకేంద్రం ఇచ్చే 15వ ఆర్ధిక సంఘం నిధులను జగన్ సర్కార్ దారి మళ్లించి దాదాపుగా 1300 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను చెల్లించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే చెలరేగగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం జగన్ సర్కార్ ఆగడాలకు చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

తాజాగా ఇచ్చిన ఆదేశాల మేరకు… గ్రామాల అభివృద్ధి కొరకు 15వ ఆర్ధిక సంఘం క్రింద కేంద్రం కేటాయించే నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేయబోమని, దీని కోసం ‘పంచాయితీ’ పేరుతోనే బ్యాంకు ఖాతాలను అన్ని పంచాయితీలు తక్షణమే ఓపెన్ చేసి, ఆ వివరాలను నేరుగా పంపాల్సిందిగా తెలిపింది.

దీంతో ఇక నుండి ఈ నిధులను వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకుండా పోయింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం జగన్ సర్కార్ కు భారీ షాక్ ని ఇచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ నిర్ణయం సర్పంచ్ లకు కాస్త ఊరటనిచ్చే అంశం.

గత వారంలో 14, 15వ ఆర్ధిక సంఘం నుండి దాదాపుగా 1300 కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం దారి మళ్లించడంతో, సర్పంచ్ లంతా షాక్ కు గురయ్యారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఫిర్యాదుల వెల్లువ వెళ్లగా, దానికి పర్యవసానమే ఈ తాజా నిర్ణయంగా తెలుస్తోంది.