MP Kanumuru Raghu Rama Krishnam Raju complaints on YSRCP leadersవైఎస్సార్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన మరో ఎనిమిది చోట్ల ఐటీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. రఘురామ కృష్ణంరాజు సొంత పార్టీతో విభేదించి బీజేపీతో సఖ్యతతో మెలుగుతున్నప్పటికీ ఈ దాడులు జరగడం విశేషం.

బహుశా వైఎస్సార్ కాంగ్రెస్ తో పొత్తు నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజును బీజేపీ పక్కన పెట్టడానికి సిద్ధం అవుతుందా అని చర్చ జరుగుతుంది. కాగా వార్తలపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. తన నివాసాలపై ఐటీ దాడులు టీవీల్లోనే చూస్తున్నానని, అలాంటిదేమీ లేదని ఆయన వివరణ ఇచ్చారు.

అయితే ఢిల్లీ నుండి వచ్విన సీబిఐ ప్రత్యేక బృందాలు, ఇందు,భారత్ కంపెనీ తో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ ల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్టు సమాచారం. 2019 ఎన్నికల ముందు కూడా ఈయనపై ఈ కేసులో సిబిఐ దాడులు జరిగాయి. అయితే ఆ తరువాత ఆ కేసు విషయంలో పురోగతి లేదు.

థర్మల్ ప్రాజెక్టు నిర్మాణంకంటూ అప్పు చేసి వాటిని మరలించి బ్యాంకులకు 826 కోట్ల మేర పంగనామాలు పెట్టారని ఆరోపణ. ఈ కేసులో ఎంపీ సతీమణితో పాటు పదకొండు మంది నిందితులు. ఈ విషయం పెద్దది అయితే వైఎస్సార్ కాంగ్రెస్ కు రఘురామ కృష్ణంరాజు పోరు తప్పే అవకాశం ఉంది.