ys vivekananda reddy case Will it take another turnమాజీ మంత్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఫోరెన్సిక్ విభాగం విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. వైయస్ వివేకానంద రెడ్డి రాసినట్లు చెబుతున్న లేఖ.. ఆయన అయిష్టంగా, బలవంతంగా, ఒత్తిడిలో రాసినట్లు కనిపిస్తోందని సీబీఐ పేర్కొంది. వివేకానంద రెడ్డి రాసినట్లు చెబుతున్న లేఖను సీబీఐ ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో సైకలాజికల్ ఎనాలసిస్ చేయిస్తే.. ఆ లేఖను తప్పనిసరి పరిస్థితుల్లో, ఇతరుల ఒత్తిడి మధ్య రాసినట్లు ఉందని రిపోర్ట్ వచ్చింది.

లేఖ రాసే సమయంలో మెదడుకు, పెన్నుకు మధ్య సమన్వయం లేదని, తీవ్రమైన ఒత్తిడి, బలప్రయోగం మధ్య రాసినట్లు ఉందని ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేలింది. అక్షరాలు క్రమ పద్ధతిలో లేవని, కాగితంపై పెన్ను ఒత్తిడి ఒక్కో చోట ఒక్కోలా ఉందని, అక్షరాలు కొన్ని చోట్ల చిన్నవిగా, మరికొన్ని చోట్ల పెద్దగా ఉన్నాయని తెలిపింది. ఇక సంతకంలో వైయస్ అక్షరాలు కూడా మిస్ అయినట్లు గుర్తించింది. లేఖ రాసినప్పుడు వైయస్ వివేకానంద రెడ్డి స్వేచ్ఛగా లేరని, ఆందోళన, ఒత్తిడి మధ్య ఉన్నారని, లేఖ అసంపూర్తిగా ఉందని పేర్కొంది. కాగా 2019 మార్చి 15వ తేదీని వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరగగా.. ఆయన శవం వద్ద ‘నా డ్రైవర్ ను నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లేఖ రాయడానికి చాలా కష్టమైంది. డ్రైవర్ ప్రసాద్ ను వదిలిపెట్టొద్దు. ఇట్లు వివేకానంద రెడ్డి’ అని రాసిన ఓ లేఖ లభించింది.

కాగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు వైయస్ వివేకానంద రెడ్డి స్వయానా బాబాయ్ కావడంతో హత్య రాజకీయమైంది. సొంత బాబాయ్ ని వైయస్ జగన్ హత్య చేయించారని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు గుప్పించడం, విచారణ సాగుతోందని, కారకులను వదిలిపెట్టేది లేదని ప్రభుత్వం తరఫున సమాధానాలు వచ్చాయి.

నిన్న మొన్నటి వరకు సునీత సిబిఐ ముందు వెల్లడించిన కథనాలూ కొన్ని బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ జగన్ కు, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాయని సునీతను ఏకంగా చంద్రబాబు బాబు అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ రోజుకోరకంగా శ్రీదేవి నుంచి నివేదికలు రావడం చూస్తుంటే.. సునీత చేస్తున్న ఆరోపణలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

మరి ఇప్పుడు ఈ లేఖ విషయంపై వైసీపీ నేతలు ఏమంటారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేఖ వివేకానందరెడ్డి స్వచ్ఛత రాయలేదని బలవంతంగా రాణించారని తెలిసిపోతుంది కాబట్టి.. త్వరలోనే మరిన్ని ఆధారాలు బయటపడే అవకాశం ఉంది.