Catherine Tresa Alexander to romance nandamuri balakrishnaఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత గట్టిగా ఉంది. దానితో ఇప్పుడు బాబాయ్ బాలయ్య అబ్బాయి కళ్యాణ్ రామ్ ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చెయ్యాల్సిన పరిస్థితి. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కోసం కేథరిన్ ని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం కోసం ఆమెకు కేరీర్ లోనే హైయెస్ట్ గా 80 లక్షల పారితోషికం ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆమెను కళ్యాణ్ రామ్ సినిమాకు కూడా హీరోయిన్ గా తీసుకున్నారు. కళ్యాణ్ రామ్ తో కొత్త దర్శకుడు వేణు మల్లిడి చెయ్యబోతున్న సోషియో ఫాంటసీ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారట.

ఈ సినిమాకు ‘రావణ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఓ భిన్నమైన పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. జనవరిలో పండగకు కళ్యాణ్ ఎంతమంచి వాడవురా సినిమా విడుదల అవుతుంది. ఆ తరువాత ఈ సినిమా పట్టాల మీదకు ఎక్కుతుంది.

ఏదేమైనా బాబాయి బాలకృష్ణతో పాటు అబ్బాయి కళ్యాణ్ రామ్‌ సినిమాలను ఒకేసారి ఓకే చేసిన కేథరిన్ ఈ సినిమాల్లో ఎలాంటి పాత్రల్లో కనిపిస్తుందో చూడాలి. అందాల ఆరబోతకు ఎంతమాత్రం వెనుకాడని ఈ బ్యూటీని ఆయా చిత్రాల దర్శకులు ఎంతవరకు వినియోగించుకుంటారో చూడాలి.