Chandrababu Naidu - Rahul Gandhi - TDP - Congress Partyతెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిసి 24 గంటలు కాకముందే ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. చంద్రబాబు నాయుడు దూకుడుకు కల్లెం వెయ్యడానికా అన్నట్టు ఈ కేసు ముందుకు రావడంతో సర్వత్రా చర్చ జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే … ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

[m9ads]

శుక్రవారం ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. రాజకీయ శత్రుత్వంతోనే రామకృష్ణా రెడ్డి పిటిషన్‌ వేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.

అదే విధంగా ఫిబ్రవరి, మార్చిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఉంటాయని ఆయన చెప్పిన మాటకు తాము ఏమీ చెయ్యలేము అని కోర్టు తేల్చి చెప్పింది. 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు వేసిన ఛార్జ్ షీట్లలో చంద్రబాబును నిందితుడిగా పేర్కొనలేదు. బీజేపీయేతర పక్షాలను ఒక తాటిపైకి తీసుకుని వచ్చి మోడీని గద్దె దించుతామని ప్రకటించిన చంద్రబాబును కేంద్రంలోని పెద్దలు టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.