sardar vallabhbhai patel statue of unityకరోనా రక్కసి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో లాక్‌డౌన్ కారణంగా కొందరికి పనిలేకుండా పోయింది. ఇంటర్ నెట్ లో వాళ్ళు తమ క్రియేటివిటీకి పని చెబుతున్నారు. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ విగ్రహాన్ని ఒక ప్రబుద్దుడు ఏకంగా ఓఎలెక్స్ లో అమ్మకానికి పెట్టాడు.

కేంద్రం దాదాపు 3వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ 182 మీటర్ల విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా గుర్తింపుపొందింది. దీన్ని ఇప్పటివరకూ సందర్శించిన పర్యాటకుల ద్వారా 82 కోట్ల ఆదాయం కూడా వచ్చింది. గుజరాత్‌లోని నర్మదా నది వద్దనున్న విగ్రహాన్ని 30,000 కోట్లకు అమ్ముతున్నట్టు చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి.

కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో.. దాన్ని అరికట్టేందుకు వినియోగించే వైద్య పరికరాల్లో కొరత ఏర్పడింది. దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుంటున్నట్టు ఆ పోస్టులో చెప్పుకొచ్చాడు. దీన్ని ఫేక్‌పోస్ట్‌గా గుర్తించిన ఓఎల్‌ఎక్స్ కూడా వెంటనే తమ పోర్టల్‌ నుంచి తొలగించింది.

కానీ, అప్పటికే కొందరు స్క్రీన్‌షాట్లు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిపై గుజరాత్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి విచారణ జరుపుతున్నారు. ఐపిసి, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద మోసం, ఫోర్జరీ కేసు నమోదైందు చేసినట్టు తెలిపారు. ఇలాంటి ప్రకటన సర్దార్ పటేల్‌ను ఆరాధించే అనేక కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది అని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు