Can the Jagan government put case on his own ministerకర్నూల్ లో ఒక కోవిడ్ వేరియంట్ పుట్టిందని… అది చాలా శక్తివంతమైందని… ప్రజలు, ప్రభుత్వం జాగ్రత్తగా ఉండదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అయితే చంద్రబాబు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, కర్నూల్ కు మచ్చ తెచ్చి న్యాయ రాజధాని కాకుండా అడ్డుకుంటున్నారని ఒక లాయర్ ఎవరో కర్నూల్ లో కేసు పెట్టాడంట.

పెట్టగానే తడవుగా చంద్రబాబు మీద ఏకంగా నాన్ బెయిలబుల్ కేసు పెట్టేశారు. అయితే ఆ కేసు పక్కన పెడితే… జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లోని ఒక మంత్రి సిదిరి అప్పలరాజు ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతున్న క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరిగ్గా చంద్రబాబు ఏదైనా అన్నారో సదరు మంత్రిగారు కూడా అదే చెప్పుకొచ్చారు.

ఒకవేళ చంద్రబాబు ది కేసు పెట్టే అంతటి నేరమైతే…. సదరు మంత్రిగారు చేసింది కూడా తప్పే కదా? ఆయన మీద కూడా కేసు పెడతారా? అని టీడీపీ అభిమానులు ట్విట్టర్ లో ప్రశ్నిస్తున్నారు. అయితే అధికార పార్టీలో ఉండే వారికి సహజంగా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఆ ప్రకారం ఆ మంత్రి గారికి మినహాయింపు వచ్చి ఉండొచ్చు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజు 20,000 కు తక్కువ కాకుండా కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలోని అత్యంత ప్రమాదకరమైన ముప్పయి జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడు జిల్లాలు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది.