Can Jagan or his leaders answer that question?వాక్సిన్లు వెయ్యడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా వెనుకబడింది. నిన్నటికి మహారాష్ట్ర లో 18-44 వయసు వారికి ఐదు లక్షలకు పైగా వాక్సిన్లు వెయ్యగా… ఆంధ్రప్రదేశ్ లో 800 మందికి మాత్రమే వేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. అయితే వెంటనే ముఖ్యమంత్రే రంగంలోకి దిగి టీడీపీ పై ఎదురుదాడి చేశారు.

వాక్సిన్ కంపెనీ ఓనర్ రామోజీ రావు కుమారుడి వియ్యంకుడు అని, చంద్రబాబుకు కూడా చుట్టరికం ఉందని… ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అని ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత కొవాక్సీన్ లైసెన్స్ రద్దు చేసి అన్ని ఫార్మా కంపెనీలు వాక్సిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసి వీలైనంత త్వరలో ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రధానికి లేఖ రాశారు.

అయితే జగన్ ప్లాన్ చాలా వరకు వర్క్ అవుట్ కాలేదనే చెప్పుకోవాలి. వాక్సిన్ కంపెనీలకు కులం, రాజకీయాలు ఆపాదించడం సరికాదని చాలా మంది జగన్ కు చెబుతున్నారు. అంతే కాకుండా కొవాక్సీన్ కు చంద్రబాబు అడ్డుపడుతుంటే… కోవిషీల్డ్ ఎందుకు తెచ్చి ప్రజలకు వాక్సిన్ ఇవ్వడం లేదని వారు నిలదీస్తున్నారు.

మరోవైపు….. భారత్ బయోటెక్ కో-ఫౌండర్ సుచిత్ర ఎల్లా ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేస్తూ కొన్ని రాష్ట్రాలు తమకు దురుద్దేశాలు ఆపాదించడం మొత్తం తమ టీం ని ఎంతగానో బాధపెట్టిందని ఒక ట్వీట్ వేశారు. ఆమె ట్వీట్ కు కూడా సోషల్ మీడియాలో మంచి మద్దతు వస్తుంది.