C Voter -Survey shocks KCRముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన చరిత్ర లేదని తెలిసి కూడా సాహాసం చేసిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం సరైనదా? లేదా? అన్నది తేలాలంటే దాదాపుగా మరో నెల రోజుల పాటు వేచిచూడాలి. అయితే క్రమక్రమంగా వస్తోన్న సర్వేల ఆంతర్యం మాత్రం కేసీఆర్ కు ఏ మాత్రం మింగుడు పడని అంశంగా మారుతోందని చెప్పడంలో సందేహం లేదు.

ఏ పార్టీ సర్వేలు ఆ పార్టీలకు ఉంటాయి, అలాగే ఆయా పార్టీల అభిమానులు కూడా వాటినే విశ్వసిస్తుంటారు, ఇది సహజం. కానీ సర్వేలలో నేర్పరి గల సంస్థలు ఇచ్చే నివేదికలు రాజకీయ పార్టీలను అలర్ట్ చేస్తుంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్ అలాంటి ఓ సర్వే నివేదికే కలవరపాటుకు గురిచేస్తోంది. సర్వేలను నిబద్ధతతో అందించగల పేరున్న సి-ఓటర్ సర్వే తాజాగా అందించిన నివేదిక కేసీఆర్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది.

తెలంగాణాలో కాంగ్రెస్ – టిడిపిలు 64 స్థానాలతో దిగ్విజయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అధికార కేసీఆర్ సర్కార్ కేవలం 42 స్థానాలతో సరిపెట్టుకుంటుందని, బిజెపి నామమాత్రంగా 4 స్థానాలను, ఎంఐఎం మరియు ఇతరులు కలిసి 9 స్థానాలను పంచుకుంటారని ఈ సర్వే తేల్చింది. బహిరంగంగా ఈ సర్వేను కేసీఆర్ లైట్ తీసుకుంటూ కొట్టిపారేయవచ్చు, అలాగే విమర్శలు చేయవచ్చు. కానీ లోన అంతర్మధనం ప్రారంభమై ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.

చరిత్ర సృష్టిద్దామని సర్కార్ ను రద్దు చేసిన కేసీఆర్, చివరికి తన మెడకే చుట్టుకునే విధంగా పర్యవసానాలు తెలంగాణాలో ఏర్పడుతున్నాయి. అంతకుముందు ‘కేక్ వాక్’ అంటూ ఊదరకోట్టిన మీడియా వర్గాలు కూడా ప్రస్తుతం కేసీఆర్ కు గడ్డు పరిస్థితి ఎదురుకానుందని చెప్తున్నాయి. బహుశా డిసెంబర్ 7వ తేదీన ‘ఆంధ్రా ఆక్టోపస్’ లగడపాటి రాజగోపాల్ ఇచ్చే సర్వేతో తెలంగాణా గడ్డ మీద మళ్ళీ అధికారం ఎవరు చేపడతారో కాస్త స్పష్టత రావచ్చు.