c-ramachandraiah-joining-ysrcpటీడీపీతో కాంగ్రెస్ పొత్తును నిరసిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి సి రామచంద్రయ్య వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వైకాపా నాయకులతో మాట్లాడిన ఆయన వచ్చే వారంలో జగన్ ను కలిసి ఆ పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం. గతంలో ఛార్టర్డ్ అకౌంటెంట్ గా పని చేసిన ఆయన టీడీపీ ద్వారా రాజకీయాలలోకి వచ్చారు.

టీడీపీ ఆయనకు సముచిత స్థానం కలిపించినా ఆయన 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన వెంటనే ఆ పార్టీలో చేరి మచిలీపట్నం పార్లమెంట్ కు పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలలో ఓడిపోయి ఆ తరువాత కాంగ్రెస్ ప్రజారాజ్యం విలీనంలో కీలక పాత్ర పోషించారు. కిరణ్ కుమార్ రెడ్డి కాబినెట్ లో మంత్రి అయ్యారు.

చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యం వల్ల, కాపు కులస్తుడు కావడం వల్ల ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగినా అనూహ్యంగా ఆయన వైకాపా వైపు మొగ్గు చూపారు. కడప జిల్లాకు చెందిన రామచంద్రయ్య… వైసీపీ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతారని… పలు విభాగాల్లో ఆయన సేవలు వినియోగించుకోవచ్చు అనే యోచనలో ఉంది వైసీపీ. మంచి వక్త ఐన ఆయన టీవీ డిబేట్లలో కూడా ఉపయోగపడతారని ఆ పార్టీ భావిస్తుంది.