‘కంచరపాలెం’ ఫ్యాన్స్ లో మహేష్ బాబు!

What's the Target for C/o (Care of) Kancharapalem in the USA?

ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “కేరాఫ్ కంచరపాలెం” సినిమాకు సినీ విమర్శకులు పట్టాభిషేకం చేసిన విషయం తెలిసిందే. తెలిసిన యాక్టర్ ఒక్కరు కూడా లేకపోయినా, సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించిన ఘనతను దర్శకుడు వెంకటేష్ మహా సొంతం చేసుకున్న వైనాన్ని ఇప్పటికే పలువురు టాప్ సెలబ్రిటీలు కొనియాడారు.

ఈ జాబితాలోకి తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు కూడా చేరిపోయాడు. కొత్త రకమైన సినిమాలను ప్రశంసించడంలో ముందు వరుసలో ఉంటోన్న ప్రిన్స్, తాజాగా “కేరాఫ్ కంచరపాలెం” సినిమాపై ట్వీట్స్ చేస్తూ అభినందనలు కురిపించారు. ఇది నిజంగా దర్శకుడి సినిమా అని, అన్ని క్యారెక్టర్లను బాగా రాసారని, క్లైమాక్స్ అయితే హార్ట్ టచింగ్ గా ఉందంటూ ప్రిన్స్ తనదైన శైలిలో ప్రశంసించారు.

మొదటి సినిమాతో అద్భుతమైన ప్రతిభను వెంకటేష్ మహా చాటుకున్నాడని, ఇక ఇలాంటి టాలెంట్ ను వెలికితీసిన రానాను చూస్తే గర్వంగా ఉందంటూ ప్రిన్స్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనికి స్పందించిన రానా, ‘నేను, నా టీం మీ నుండి ఇలా వినడం చాలా సంతోషాన్నిచ్చిందని’ రిప్లై ఇచ్చారు.

Follow @mirchi9 for more User Comments
Umamaheswara Ugraroopasya OTT ReleaseDon't MissDirect OTT Release, Good or Bad Choice?As the wait is getting longer, filmmakers and producers are growing intolerant and at least,...RGV - Ram Gopal Varma - Vijay Deverakonda -Fake NewsDon't MissIt's Stupidity to Shut Fake News: RGV to DeverakondaRGV is one maverick genius who calls a spade a spade. What was his opinion...Prashanth-Neel’s-Chance-To-Be-Shankar--2.0Don't MissPrashanth Neel’s Chance To Be Shankar 2.0So, it is not one but two films that this sensational director is going to...Green Tribunal Legal Notice to KTRDon't MissGreen Tribunal Legal Notice to KTRNational Green Tribunal (NGT) had taken cognizance of Congress MP Revanth Reddy's complaint about Telangana...Rakul Preet Singh Try -VeganDon't MissRakul Preet Hiding Nudity Behind VegetableJune 5th happens to be 'World Environment Day' and that gives us a chance to...
Mirchi9