c kalyan movie witk srinu vaitlaఒకప్పుడు చిన్న నిర్మాతగా ఉన్న సి.కళ్యాణ్ ప్రిన్స్ మహేష్ బాబుతో తీసిన “ఖలేజా” సినిమాతో భారీ సినిమాల నిర్మాతగా మారారు. ఆ సినిమాకు సింగమనల రమేష్ తో కలిసి సహా ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కళ్యాణ్ పై, ఆ తర్వాత అనేక అభియోగాలు వ్యక్తమయ్యాయి. అయితే అవేమీ కళ్యాణ్ ను సినీ నిర్మాణానికి దూరం చేయలేకపోయాయి. ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ తో నిర్మించిన “లోఫర్” సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేసే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.

ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తన తదుపరి చిత్ర విశేషాలను చెబుతూ… త్వరలో శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించబోతున్నానని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, కధ ఫైనల్ కాగానే వివరాలన్నీ అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు. ‘బ్రూస్ లీ’ పరాజయం తర్వాత శ్రీనువైట్ల పరిస్థితి ఏమిటి? అన్నది ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో శ్రీనువైట్ల తదుపరి సినిమా పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి హీరో, ఇతర కాస్టింగ్ తదితర వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.