ByElection results against BJPఈరోజు వెలువడిన ఉపఎన్నికల ఫలితాలు మోడీ అమిత్ షాలకు కంటిమీద కునుకు లేకుండా ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక పార్లమెంట్ ఎన్నిక, ఒక అసెంబ్లీ ఎన్నిక రెండూ బీజేపీకు పెద్ద షాక్ ఇచ్చాయని చెప్పుకోవాలి. కైరానా లోక్ సభ స్థానాన్ని 2014లో బీజేపీ 2.35 లక్షల మెజారిటీతో గెలుపొందింది.

ఆ ఎంపీ మరణంతో వచ్చిన ఉపఎన్నికలో బీజేపీ దాదాపుగా 55000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. చనిపోయిన ఎంపీ కుటుంబానికే టిక్కెట్టు ఇచ్చిన పని అవ్వలేదు అంటే ఉత్తరప్రదేశ్ లో మోడీ వ్యతిరేకపవనాలు వీస్తున్నాయి అనే చెప్పుకోవాలి. కొంత కాలం కిందట జరిగిన ఉపఎన్నికల్లో కంచుకోటల్లాంటి గోరఖ్‌పూర్, పుల్పూర్ లోక్‌సభ సీట్లను బీజేపీ కోల్పోయింది.

ఈ రెండూ.. బీజేపీ సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామా చేసిన లోక్‌సభ నియోజకవర్గాలు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న మొత్తం 80 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గత ఎన్నికల్లో 71 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ మిత్రపక్షానికి ఇంకో రెండు సీట్లు వచ్చాయి ఈ కారణంగానే.. బీజేపీకి కేంద్రంలో పూర్తి మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఈ ఫలితాల బట్టి యూపీలో ప్రతిపక్షాలన్నీ ఒకటి అవ్వడంతో మోడీ కి అంత తేలికకాదని సులువుగానే అర్ధం అవుతుంది.